గాసిప్స్

శ్రీదేవి కూతురి మొదటి సినిమా



త రెండు మూడేళ్లలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెరంగేట్రం గురించి ఎన్నెన్ని వార్తలొచ్చాయి. బాలీవుడ్లో చాలామంది ఫిలిం మేకర్స్ ఆమె కోసం ఎదురు చూస్తున్నట్లు.. సౌత్ ఇండియా నుంచి కూడా చాలామంది ఆమె కోసం ట్రై చేస్తున్నట్లు రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్లో ఏదీ నిజం కాలేదు. ఈ మధ్య వరుణ్ ధావన్ సరసన సిద్ధత్-2లో ఆమె కథానాయికగా ఫిక్స్ అయిందని.. అదే ఆమె తొలి సినిమా అని అన్నారు. ఆ తర్వాత అది కూడా నిజం కాదని తేలింది. ఐతే ఎట్టకేలకు కూతురి అరంగేట్రం కోసం శ్రీదేవి ఓ సినిమాను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. జాన్విని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. ఆయన తీయబోయే స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సీక్వెల్ తో జాన్వి హీరోయిన్ కాబోతోంది.

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో వరుణ్ ధావన్.. ఆలియా భట్ లాంటి తారలు హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఎంత మంచి స్థాయికి వెళ్లారో తెలిసిందే. కాబట్టి తన కూతురు కూడా వాళ్లలాగా ఎదిగిపోతుందన్న ఆశతో ఈ సినిమాకు శ్రీదేవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారాను కథానాయికగా నటింపజేయాలని అనుకున్నాడు కరణ్. కానీ సారా తల్లి అమృత అందుకు అంగీకరించలేదు. దీంతో కరణ్ కళ్లు జాన్వి మీద పడ్డాయి. ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడు. ఒక హిట్ సినిమాకు సీక్వెల్.. అందునా కరణ్ జోహార్ దర్శకత్వం అనేసరికి శ్రీదేవి ఎక్కువగా ఆలోచించలేదు. ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక సమాచారం రానుంది. మొత్తానికి అతిలోక సుందరి కూతురు త్వరలోనే కెమెరా ముందుకు వచ్చేస్తోందన్నమాట.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu