ఆంధ్రప్రదేశ్

TDP ఆఫిసియల్ వాట్సాప్ గ్రూప్: నారా లోకేష్



ఇప్పుడు వాట్సప్ వినియోగం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్యుల నుంచి పెద్ద స్థాయి వ్యక్తుల వరకు అంతా ఈ అప్లికేషన్ ను యూజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా వాట్సప్ ను యూజ్ చేసుకుని కన్ఫ్యూజన్ తొలగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్టీలోని చాలామంది నాయకులు పలు సమస్యలపై రకరకాలుగా స్పందిస్తున్నారు. నాయకులందరికి ఈ విషయంలో పార్టీ అభిప్రాయం చెప్పలేకపోయినా… పార్టీకి మౌత్ పీస్ లా ఉండే అధికార ప్రతినిధులు మాత్రం ఓ అంశంలో తలోమాట మాట్లాడకుండా ఉండేందుకు పార్టీ యువనేత లోకేశ్ వాట్సప్ ను వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఇందుకు సంబంధించి పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ మధ్య పలు అంశాలపై పార్టీ నేతలు రకరకాలుగా స్పందించడం… పార్టీ అధికార ప్రతినిధులకు సైతం ఆయా అంశాలపై సరైన అవగాహన లేకపోవడం వంటి అంశాలు లోకేశ్ దృష్టికి వచ్చాయట. దీంతో ఎప్పటికిప్పుడు పార్టీ అధికార ప్రతినిధులు స్పందించి వలసిన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆయా అంశాల్లో పార్టీ వైఖరి ఏంటనే దానిపై వారికి స్పష్టమైన అహగాహన కల్పించడానికి ఈ వాట్సప్ గ్రూప్ ఎంతగానో ఉపయోగపడుతుందని చినబాబు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ గ్రూప్ లో తాను కూడా ఉంటానని… అవసరాన్ని బట్టి తాను కూడా ఈ గ్రూప్ ను వినియోగిస్తానని లోకేశ్ పార్టీ నాయకులకు చెప్పినట్టు సమాచారం. ఈ గ్రూప్ లో ఉన్న అధికార ప్రతినిధులు ఎప్పటికప్పుడు కింది స్థాయి కేడర్ కు పలు అంశాలపై తమ అభిప్రాయాన్ని చెప్పాలని టీడీపీ యువనేత ఆదేశించినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu