Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
తెలంగాణ

పెద్ద నోట్ల రద్దు ఎదుర్కునేది ఎలా-తెలంగాన ప్రభుత్వం



పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ ప్రభుత్వం టెన్షన్ పడుతోంది.దీనిపై ప్రత్యామ్నాయ వ్యూహాలకు సిద్దం అవుతోంది.కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపధ్యంలో వివిధ రంగాలలో ఆదాయంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ ఆదేశించారు.

మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శ్రీ ప్రదీప్ చంద్ర, శ్రీ యస్.పి.సింగ్, శ్రీ యంజి.గోపాల్, శ్రీమతి రంజీవ్ ఆర్.ఆచార్య, శ్రీ యస్.కె.జోషి, శ్రీ అజయ్ మిశ్రా, సియంఓ ముఖ్యకార్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రామ కృష్ణారావు, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, ఇంటెలిజన్స్ ఐ.జి. శ్రీ నవీన్ చంద్, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిత్తల్ తదితరులు పాల్గొన్నారు.
పెద్ద నోట్ల రద్దు నేపధ్యంలో రాష్ట్ర ఆదాయం పై పడే ప్రభావంపై ప్రతి రోజు సమావేశం కావాలని, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, తమ తమ శాఖలలో ఏర్పడే ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ఆయా
శాఖలతో సంబంధం ఉన్న వివిధ సంస్ధలు, వ్యక్తులతో రంగాల వారిగా సమావేశాలు నిర్వహించుకొని, దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలన్నారు.

వివిధ శాఖలకు సంబంధించి గత 7 నెలల్లో వచ్చిన ఆదాయంతో పాటు నోట్ల రద్దు తరువాత నవంబర్ లో వచ్చిన ఆదాయం భవిష్యత్తులో ఉండే పరిస్ధితులు తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల ద్వారా రాబోయే మాసాలలో లభించే ఆదాయం, గ్రాంట్స్, తదితర అంశాలపై సమీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించాలని అందుకు తగ్గ వ్వూహాన్ని రూపొందించుకోవాలని డా. రాజీవ్ శర్మ అధికారులను కోరారు. అస్తుల రిజిస్ట్రేషన్లు, వ్యాట్, ఎక్సైజ్ ఆదాయం, రవాణా పన్ను నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నెల వారిగా అయ్యే ఖర్చులు తదితర అంశాలపై చర్చించారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu