Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అవుట్‌…కొత్త గ‌వ‌ర్న‌ర్ ఈయ‌నే



ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ఉంటోన్న న‌ర‌సింహ‌న్‌ను కేంద్రం తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా తొల‌గించేందుకు రంగం సిద్ధ‌మైంది. న‌ర‌సింహ‌న్ స్థానంలో
కర్ణాటక విధానపరిషత్ సభాపతి, బీజేపీ సీనియర్‌ నేత డి.హెచ్.శంకరమూర్తిని తెలంగాణ లేదా పాండిచ్చేరిల గవర్నర్‌గా నియమించే అవకాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

గత వారంలోనే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయంపై శంకరమూర్తితో చర్చించారు. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్న నరసింహన్ స్థానంలో శంకరమూర్తికి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్‌గా శంకరమూర్తిని నియమించవచ్చు. లేనిపక్షంలో కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించే అవకాశం ఉంది. మరో రెండు మూడు రోజులలో ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం.

ఇక ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగుతోన్న న‌ర‌సింహ‌న్ ఇటీవ‌ల కాంట్ర‌వ‌ర్సీల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న ప్రెస్‌మీట్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా మాట్లాడుతుండ‌డంపై అంద‌రూ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు కేంద్రం షాక్ ఇచ్చేలా డెసిష‌న్ తీసుకోవ‌డం విశేషం.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu