అంతర్జాతీయ

పదిరోజుల్లోనే రెండు సార్లు గర్భం దాల్చిన యువతి



వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఒక మహిళ పది రోజుల్లోనే రెండు సార్లు గర్భం దాల్చింది. పైగా పండంటి పిల్లలకు జన్మనిచ్చింది. ఇక్కడితోనే ఈ ఆశ్చర్యకర వార్త అయిపోలేదు. ఆమె జన్మ ఇచ్చిన కవలలు ఇద్దరు వేర్వేరు పోలికలతో ఉన్నారు. ఇంత వింత సంఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జరిగింది. కేట్ హిల్ అనే మహిళ సూపర్ఫెటేషన్ {ఒకేసారి రెండు అండాలు గర్భంలోకి చేరడం} అనే అరుదైన వైద్య స్థితి వల్ల 10 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు గర్భవతి అయిందని తేల్చారు.

2006 నుంచి కేట్ హిల్ హార్మోన్ చికిత్స పొందుతున్నారు. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వ్యాధితో ఈ చికిత్స పొందుతున్న హిల్ తన భర్తతో ఒకేసారి శృంగారంలో పాల్గొన్నప్పటికీ ఇలా రెండు సార్లు గర్భం దాల్చింది. దీనిపై వైద్యులు పరిశోధన చేయగా ఆమె విడుదల చేసిన అండాలు వీర్యంతో రెండు సార్లు ఫలదీకరణం చెందడం వల్ల ఇలా జరిగిందని తేల్చారు. తద్వారనే ఇలా జరిగిందని ఈ అరుదైన అంశం గురించి వైద్యులు వివరించారు. కొసమెరుపు ఏంటంటే పది రోజుల వ్యవధిలో రెండు సార్లు జరిగిన ఘటనల్లో కేట్ హిల్ సంఖ్య పదవది!


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu