Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
నేటి వార్తలు

మహేష్ బాబు పై మండలిలో పిర్యాదు చేసిన పీవీపీ



వంశీ పైడిపల్లి. ఊపిరి సినిమాతో మెమరబుల్ సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు పీవీపీ బ్యానర్ కారణంగా వివాదాల్లోకి ఎక్కాడు. పీవీపీ బ్యానర్ లోనే ఊపిరి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. సినిమా అంతా బాగానే వచ్చినా.. అనుకున్న బడ్జెట్ దాటిపోవడంతో.. ఇన్వెస్ట్ మెంట్ ను పీవీపీ బ్యానర్ తిరిగి సాధించలేకపోయింది. ఆ లాస్ రికవర్ చేసేందుకు.. పీవీపీకి ఓ సినిమా చేస్తానని వంశీ పైడిపల్లి హామీ ఇచ్చాడట.

అంతే కాదు. ఊపిరి హీరో నాగార్జున కూడా పీవీపీ బ్యానర్ లో ఓ సినిమా చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆ మాట తీర్చుకునేందుకు ఇప్పుడు రాజు గారి గది – 2 సినిమాను పీవీపీ నిర్మాణంలో చేస్తున్నాడు. ఇదే టైమ్ లో.. ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు పీవీపీ అంగీకారం కుదుర్చుకుంది. బ్రహ్మోత్సవం ఇచ్చిన భయంకర అనుభవం నుంచి తేరుకునేందుకు మహేష్ ఈ సినిమా అంగీకరించినట్టు ప్రచారం జరిగింది.

మరోవైపు… ఆల్రెడీ వంశీ పైడిపల్లి ఓ సినిమాకు కమిట్ అయ్యే ఉన్నాడు. దీంతో.. మహేష్ బాబుతో తీసే సినిమాను.. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో పూర్తి చేయాలని పీవీపీ అనుకున్నాడు. అందుకు తగ్గట్టే సినిమా కూడా అనౌన్స్ అయ్యింది.

కట్ చేస్తే.. పీవీపీకి, వంశీ పైడిపల్లికి ఎక్కడో తేడా కొట్టింది. విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మహేష్ తో వేరే బ్యానర్ లో సినిమా చేస్తున్నట్టు వంశీ ప్రకటించాడు. దీంతో.. పీవీపీకి కాలిపోయింది. తనకు సినిమా చేయకపోవడం అటుంచితే.. మహేష్ బాబు లాంటి స్టార్ తో సినిమా చేయకుండా అడ్డుకున్నాడంటూ వంశీపై పీవీపీ సీరియస్ అయ్యాడు. పెద్ద హీరో అయిన మహేష్ తో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక.. వంశీ పైడిపల్లిపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. ఈ గొడవ సద్దుమణగాలంటే.. మహేష్ కానీ, వంశీ పైడిపల్లి కానీ.. ఎవరో ఒకరు ఓ మెట్టు దిగి పీవీపీతో సినిమా చేయాల్సిన పరిస్థితి ఉంది.

కొసమెరుపు ఏంటంటే.. ఊపిరి సినిమా.. పీవీపీకి ఒకటి కాదు..రెండు కాదు.. పది అంతకన్నా కాదు. కనీసం 21 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చిందట. ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకు చేసిన ప్రయత్నం.. ఇలా బెడిసికొట్టడంతోనే పీవీపీ ఆగ్రహంతో ఉన్నారంట. ఈ విషయం ఎప్పుడు చల్లారుతుందో!!


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu