రాజకీయాలు

పవన్ పైకి అధికార పార్టీ ని ఉసిగోల్పుతున్న ఆ అధికారి



పవర్ స్టార్ గా తెలుగు ప్రజల మనసులు గెలుచుకున్న పవన్ కళ్యాణ్ అప్పట్లో రాజకీయ పార్టీ పెట్టి పెద్ద సంచలనమే రేపారు. ఆ రోజు ప్రతి రాజకీయ నాయకుడు అన్న మాట ఒక్కటే పవన్ కు సినిమాలే మంచిది రాజకీయాలు చేసే అంత శక్తి లేదు, చిన్నపిల్లవాడు ప్రజల సమస్యల గురించి అతనికేం తెలుసు అని… ఇలాంటి మాటలకు సమాధానం జనసేన పార్టీ ఎంచుకున్న పంథా .. ఈ రోజుల్లో ఆ పార్టీ తప్ప మరే రాజకీయ పార్టీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు అన్న విషయం అందరికి తెలుసు.

పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి ప్రజా సమస్యను లేవనేత్తడమే ఆయన చేసిన తప్పా. పవన్ సమస్యను లేవనేత్తినపుడు అధికార పార్టీ ఎందుకు దాన్ని స్వీకరించడం లేదు. అంటే మీ పార్టీ ప్రచారానికి, మీ పార్టీ తో పొత్తు పెట్టుకోవడానికి పవన్ కావాలి కాని ప్రజా సమస్యల గురించి మాట్లాడితే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇది ప్రతి సామాన్యుని మెదడుని తొలుస్తున్న వంద కోట్ల ప్రశ్న.

అయితే టిడిపి ఒక రాజకీయ పార్టీ కాబట్టి పవన్ ను సమర్దిన్చట్లేదంటే ఒక అర్ధం ఉంది. పోలీసులు ఎందుకు పవన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారో అర్ధంకాక సామాన్యుడు ఆలోచనలో పడ్డాడు. వైజాగ్ లో పవన్ ఫ్యాన్స్ చేసిన తప్పేంటి.. సంయమనంతో, శాంతియుతం గా అధికార పార్టీ పై నిరసన తెల్పుతుంటే వైజాగ్ లో ని ఒక పోలీసు అధికారి మాత్రం పని కట్టుకుని అధికార పార్టీ కి తప్పుడు సమాచారమిచ్చి, అధికార తెలుగుదేశం పార్టీ ని పవన్ కళ్యాణ్ పై అతని అభిమానులపై రెచ్చగొట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఈయన కాని పోలీస్ ఉన్నతదికారి అయి ఉంటే వైజాగ్ కార్గిల్ ను తలపించేదేమో.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu