ఆంధ్రప్రదేశ్

గంగూలీని చంపుతానంటూ బెదిరింపు లేఖ‌భారత మాజీ కెప్టెన్‌, బంగాల్ క్రికెట్ సంఘం అధ్య‌క్షుడు సౌర‌బ్ గంగూలీకి బెదిరింపు లేఖ వ‌చ్చింది. గంగూలీని హెచ్చరిస్తూ ఓ అజ్ఞాత వ్యక్తి బెదిరింపు లేఖ రాశాడు. ఓ యూనివర్సిటీ నిర్వ‌హిస్తున్న‌ కార్యక్రమానికి గంగూలీ హాజరుకావొద్దని లేఖ‌ ద్వారా హెచ్చ‌రించాడు.

త‌న‌కు వ‌చ్చిన బెదిరింపు లేఖ‌పై గంగూలీ స్పందించారు. త‌న‌ను హెచ్చ‌రిస్తూ బెదిరింపు లేఖ వ‌చ్చిన మాట వాస్త‌మేన‌ని, జ‌న‌వ‌రి 7 న బెదిరింపు లేఖ వ‌చ్చిన‌ట్లు గంగూలీ చెప్పాడు. ఈ విషయాన్ని తాను పోలీసులు, కార్యక్రమ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లాన‌ని అన్నారు.

పశ్చిమ్‌బంగల్ లోని మేదినిపూర్‌లో విద్యాసాగర్‌ యూనివర్సిటీ, జిల్లా క్రీడా సంఘం సంయుక్తంగా జ‌న‌వ‌రి 19 న ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాల‌ని గంగూలీని ఆహ్వ‌నించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గోంటే చంపుతాన‌ని అజ్క్షాత వ్య‌క్తి లేఖ రాశాడు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu