గాసిప్స్

నాగబాబు నీకన్నా మూర్ఖుడు ఎవడు లేడు : యండమూరి



ఖైది నెంబర్ 150 ప్రీ రిలీజ్ సందర్భంగా నాగ బాబు చాలా విపరీతమైన పదజాలం తో యండమూరి వీరెంద్రనాద్ ని రాంగోపాల్ వర్మ ని విపరీతం గా తిట్టాడు. యండమూరి విరెంద్రనాద్ ని వాడొక పనికి మాలిన మనిషి. చదువుకున్న మూర్ఖుడు వాడు వ్యక్తిత్వ వికాస కోర్స్ లు చెప్తాడు అందులో వాడు ఎవ్వరినో హైలైట్ చేయడానికి చరణ్ బాబు ని తక్కువ చేసి మాట్లాడిన సంస్కారం లేని వెధవ వాడు అని తిట్టిపోశాడు.

దీనికి కౌంటర్ ఎటాక్ చేసిన యండమూరి వీరెంద్రనాద్ చాలా టివి చానెల్స్ తో మాట్లాడుతూ చాలా భాదను వ్యక్తం చేశాడు. నేను ఏరోజు చరణ్ ని తక్కువ దేవిశ్రిని ఎక్కువ చేసి మాట్లాడలేదు. మనం విజయం సాదించాలంటే మనం ఎవరికీ పుట్టాం అన్నది కాదు మనతండ్రి ఎవడు అన్నది కాదు ముక్యం మన లో ఏంత సత్తా ఉంది అన్నదే ముక్యం అని మాత్రమే నేను చెప్పా  అక్కడ అందులో చరణ్ ని తక్కువ చేయడం ఎం లేదు. అసలు మూర్ఖుడు ఎవడు అంటే ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రఘల్బాలు పలికే వాడే పెద్ద మూర్ఖుడు అంటూ ముగించారు.

నిజానికి ఈ ఇన్సిడెంట్ జరిగి చాల సంవత్సరాలే అవుతోందంట ఇది జరిగిన తరువాత కూడా నాగబాబు చాలాసార్లు యండమూరి గారిని కలిసి మంచి కథలు కావాలి అని అడగడం జరిగింది అని యండమూరి గారే స్వయం గా చెప్పారు. వారం ముందే యండమూరికి ఒక కుక్క పిల్లను కూడా బహుమతి చేసారంట నాగబాబు. మరి ఎలాంటి వ్యక్తి ఒక పెద్ద స్టేజి మీద పెద్ద కార్యక్రమం లో ఎందుకు తిట్టాడో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. కాని గమనిస్తే  పవన్ కళ్యాణ్ ఖైది నెంబర్ 150 ప్రీ రిలీజ్ కి రాలేదు ఈ టాపిక్ ని డైవెర్ట్ చేయడానికే ప్లానింగ్ ప్రకారం నాగబాబుతో ఈ మాటలు మాట్లాడించింది మెగా టీం అన్న విషయం అర్ధం కాక పోదు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu