ఆంధ్రప్రదేశ్

ఎస్సై బూట్లు క్లీన్ చేసిన వైసీపీ నేత‌ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఏపీకి హోదా ఇవ్వాల‌నే డిమాండ్ యువ‌త‌లో అధిక‌మ‌వుతోంది. దీనికి మ‌ద్ద‌తుగా విశాఖ బీచ్‌లో చేప‌ట్టిన ఉద్య‌మానికి విప‌క్ష పార్టీల‌న్ని మ‌ద్ద‌తు ఇచ్చాయి. విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ స్వ‌యంగా ఈ నిర‌స‌న‌లో పాల్గొనేందుకు విశాఖ వెళ్లారు.

ఈ క్ర‌మంలోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ నేత‌లు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కార్యకర్తలు, నేతలు ఉదయం నుంచే నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నిరసనలకు అనుమతి లేదంటూ రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

కొంద‌రు నాయ‌కుల‌ను హౌస్ అరెస్టు చేశారు. ఈ నేప‌థ్యంలోనే విజయవాడలో వైసీపీ నేత పార్ధసారథిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్ట్‌‌కు నిరసనగా రోడ్డుపైకి వచ్చి పోలీసు వాహనాలు, ఎస్సై బూట్లను ఆయన శుభ్రం చేశారు. పార్ధసారథిని బలవంతంగా ఇంట్లోకి తరలించి పోలీసులు గేట్లు వేశారు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu